Monday, January 6, 2025
Google search engine
HomeTeluguదేశాభివృద్ధిలో కాస్ట్, మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ పాత్ర కీలకం - తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

దేశాభివృద్ధిలో కాస్ట్, మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ పాత్ర కీలకం – తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

  • ఘనంగా ది ఇన్‌స్టిట్యూట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్ చాప్టర్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు

హైదరాబాద్, జనవరి 2025: దేశాభివృద్ధిలో కాస్ట్, మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ పాత్ర కీలకమని ముఖ్య అతిథి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. ఆర్థిక నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలో ది ఇన్‌స్టిట్యూట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నైపుణ్యం అసమానమన్నారు. సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో నిర్వహించిన ది ఇన్‌స్టిట్యూట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్ చాప్టర్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం కార్పొరేట్ విజయానికి పునాది కాదని, భారత ఆర్థిక స్థిరత్వం, గ్లోబల్ పోటీకి మూలస్థంభం అన్నారు. కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్‌ను కీలకమైన వృత్తిగా అభివృద్ధి చేస్తూ.. ప్రొఫెషనల్ ప్రామాణికత, సామాజిక సేవ, దేశ అభివృద్ధి పట్ల చేసిన దీర్ఘకాల కృషికి నిదర్శనమన్నారు. భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడంపై దృష్టి పెట్టిందన్నారు. ఈ తరుణంలో మారుతున్న ఆర్థిక వాతావరణంలో సీఎంఏలకు ఖర్చుల ఆప్టిమైజేషన్, వనరుల నిర్వహణ, ఆర్థిక సమగ్రతలో కీలకమైన బాధ్యత ఉందన్నారు. ‌’విజన్ ఇండియా@2047′ శ్రేయస్సు, సమృద్ధి గల భారతదేశాన్ని సూచిస్తుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆకాంక్ష సవాళ్లతో కూడిన లక్ష్యమన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వినూత్న వ్యూహాలు, సామర్థ్యాలు అవసరం అన్నారు.

దేశ లక్ష్యాలను సాధించడంలో ఇనిస్టిట్యూట్ చేసిన ప్రయత్నాలు ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస, సబ్కా ప్రయాస్’ అనే సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. ఇవి అభివృద్ధి మార్గంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూస్తున్నాయని తెలిపారు. ‌భారతదేశం లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి పూనుకున్న సమయంలో సీఎంఏలు కీలకమన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, ఖర్చుల నియంత్రణ, వనరుల నిర్వహణకు సీఎంఏలే కాపలాదారులు అన్నారు.

ఈ సందర్భంగా ఐసీఎంఏ హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ సీఎంఏ డాక్టర్ లావణ్య కందురి మాట్లాడుతూ 60వ స్థాపన దినోత్సవాన్ని జరపడం ఆనందంగా ఉందన్నారు. ఆరు దశాబ్దాల అంకితభావానికి ఇది నిదర్శనమన్నారు. ఈ సంవత్సరం థీమ్ ‘ఇన్‌స్పిరేషన్ ఇంక్యుబేటర్ – స్టెప్ ఇన్‌టు యాక్షన్’ అన్నారు. గడచిన సంవత్సరాలలో ఆలోచనలకు ప్రేరణ కలిగించడం మాత్రమే కాకుండా, వాటిని అర్థవంతమైన చర్యలుగా మార్చి సమాజంపై చెరగని ముద్ర వేశామని తెలిపారు. ఈ వేడుకలు మా గత అధ్యక్షులు, గత చైర్‌పర్సన్‌ల నిరంతర కృషిని గుర్తించడానికి ఒక గొప్ప అవకాశమన్నారు. ఇది మనందరినీ మరింత ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడానికి ప్రేరణ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఏ ఐసీఎంఏఐ వైస్ ప్రెసిడెంట్ సీఎంఏ శ్రీనివాస ప్రసాద్, ఐసీఎంఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, దల్వాడి అశ్విన్‌కుమార్ గోర్ధర్‌భాయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular