Tuesday, December 3, 2024
Google search engine
HomeTamilహైదరాబాదులో ఒక సరికొత్త షోరూమ్ ను ప్రారంభించి భారతదేశంలో రిటైల్ వాణిజ్యంలో తమ ఉనికిని విస్తరించింది

హైదరాబాదులో ఒక సరికొత్త షోరూమ్ ను ప్రారంభించి భారతదేశంలో రిటైల్ వాణిజ్యంలో తమ ఉనికిని విస్తరించింది

హైదరాబాద్: భారతీయ సంప్రదాయం మరియు ఆధ్యాత్మికపరమైన ఉత్పత్తులలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని పొందిన’ గిరి’ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ మల్కాజ్ గిరిలో సరికొత్త షోరూంను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటిస్తుంది. ప్రామాణికమైన ఆధ్యాత్మిక వనరులు మరియు సాంస్కృతిక అవసరాలను భారతదేశమంతటా విస్తరింప చేయడానికి ఈ కొత్త షోరూం అతి ముఖ్యమైన స్థానాన్ని వహిస్తుంది. ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంబంధాలను వ్యక్తిగత మరియు కుటుంబ సమూహ పరముగా మెరుగుపరిచే విధంగా అధిక నాణ్యత మరియు సాంప్రదాయ బద్ధమైన వస్తువులను అందించుటలో గిరి తమ నిబద్ధతను కొనసాగిస్తుంది. అందుకుగాను మా సంస్థ మల్కాజ్గిరి షో రూమ్ లో ఆధ్యాత్మిక పుస్తకాలు పూజా సామాగ్రిలు సాంప్రదాయ వస్త్రములు భక్తి పాటలు ఇంకా మరెన్నో రకరకాల వస్తువులను అత్యున్నత నాణ్యత మరియు ప్రామాణికత చెక్కుచెదరక అందించడమే తమ లక్ష్యంగా భావిస్తుంది.

ఎప్పుడూ సందడిగా ఉండే మల్కాజ్గిరిలో ప్రారంభింపబడిన ఈ షో రూము మల్కాజ్గిరి స్థానికులే కాక దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి కూడా ఎంతో ఇంపైన షాపింగ్ అనుభవాన్ని అందించడంలోను, స్వాగత సత్కారాలలోను మీ మనసులను రంజింప చేస్తుంది. దానివల్ల మిమ్మల్ని మా షో రూమ్ కు పదేపదే తీసుకువస్తుంది అనేదే మా నమ్మకము. అంతేకాదు మా షోరూంకు విచ్చేసే కస్టమర్లను తమ కుటుంబంలో ఒకరిగా భావించి వారి కి అవసరమైన ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ వస్తువులను విస్తృతశ్రేణిలో అందించడాన్ని తమ లక్ష్యంగా భావిస్తుంది.

ఈ సందర్భంగా గిరి సంస్థ డైరెక్టర్ శ్రీమతి శారదా ప్రకాష్ గారు “హైదరాబాదులో మా గిరి సంస్థను విస్తరించడం అనేది మాకు అత్యంత ఆనందాన్ని అందిస్తుంది అంతేకాక అధిక నాణ్యత గల ఆధ్యాత్మిక మరియు సంప్రదాయ వనరులను హైదరాబాదు నివాసులు అతి సులభంగా పొందేందుకు అనుకూలమైన పరిస్థితులను అందించడమేకాక తమ ఊపిరిగాను భావిస్తుంది”.

గిరి గురించి

1951 నుండి నమ్మకానికి మారుపేరైన బ్రాండ్‌లలో గిరి ఒకటిగా మారింది, భారతదేశంలో ఆధ్యాత్మిక మరియు మత సంబంధిత సామగ్రీలకు ప్రముఖ రిటైలర్‌గా ప్రముఖ స్థాన్నాన్ని ఆక్రమించుకొంది. సుసంపన్నమైన సంస్కృతి మరియు సంప్రదాయాలకు పేరుగాంచిన గిరి విస్తృత శ్రేణిలో పుస్తకాలు, సంగీతం, పూజా వస్తువులు, విగ్రహాలు, భారతీయ ఉత్సవ సామగ్రి, ఆర్గానిక్ ఆహార వస్తువులు, హస్తకళలు మరియు సంప్రదాయ దుస్తులను అందిస్తుంది. 70 సంవత్సరాలకు పైగా ఈ ఆధ్యాత్మిక సంస్కృతిన సేవ చేసిన గిరి, తన వినియోగదారుల ఆధ్యాత్మిక అవసరాలను నిరంతరంగా తీర్చడమే తన బాధ్యతగా ప్రవర్తిస్తుంది.

తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర మరియు ఢిల్లీ వంటి భారత రాష్ట్రాలలో 36 షోరూమ్‌లతో, గిరి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో కూడా గ్లోబల్ ఉనికిని కలిగి ఉంది. 2019లో, గిరి “తమిళనాడులో ఉత్తమ పర్యాటక స్నేహపూర్వక షాపింగ్ సెంటర్” అవార్డును అందుకుంది.

మరిన్ని సమాటారములకై : https://giri.in/

 

RELATED ARTICLES

Most Popular